ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (19:17 IST)

వాస్తు శాస్త్రం: కుబేర యంత్రాన్ని ఇంటి ఈశాన్యంలో వుంచితే..?

vastu
వాస్తు ప్రకారం సులభమైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడే వాతావరణాన్ని సృష్టించడం చేయొచ్చు. అలాగే  జీవితంలో సానుకూల శక్తులను ఆకర్షించేలా చేసుకోవచ్చు. ఇంటి శ్రేయస్సు కోసం కుబేర యంత్రాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. సానుకూల శక్తి కోసం.. ఈ దిశలో భారీ ఫర్నిచర్ లేకుండా చేసుకోవాలి. 
 
అలాగే నైరుతిలో లాకర్‌ను వుంచాలి. లాకర్లను నైరుతి మూలలో ఉంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవచ్చు. అతిథులకు ఆహ్వానం పలికే ప్రధాన ద్వారం శుభ్రంగా వుండేలా చూసుకోవాలి. సరైన తాళాలు, పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక శ్రేయస్సు కోసం నేమ్ ప్లేట్లు, మొక్కలు  విండ్ చైమ్‌లు వంటి ప్రధాన ద్వారం వద్ద వుంచాలి.
 
ధన ప్రవాహం పెరగడానికి ఈశాన్యంలో అక్వేరియం వంటి నీటి ఫీచర్లను ఉంచండి. ఆర్థిక విజయానికి అడ్డంకులను నివారించడానికి నీటి పరిశుభ్రతను పాటించాలి. ఆగ్నేయ లేదా ఈశాన్య మూలల్లో నీటి ట్యాంకులను వుంచకండి. ఇలా వుంటే ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను నివారించండి. గణనీయమైన ఆర్థిక నష్టాలు నివారించడానికి నీటి లీకేజీలను వెంటనే పరిష్కరించాలి.