శుక్రవారం, 12 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2025 (22:29 IST)

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi
Ganesh Chaturthi
వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకూడదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. వినాయకుడు అవతరించిన రోజున వినాయక చతుర్థి అంటారు. దీని ప్రకారం 2025వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజు వినాయక చవితిని జరుపుకుంటున్నారు. 
 
వినాయక చతుర్థి రోజున దేవాలయాలలో ప్రత్యేక పూజలు, పూజలు జరుగుతాయి. ఇంకా భారీ వినాయక విగ్రహాలు వుంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా ఇళ్లలో వినాయకుని విగ్రహాన్ని ఉంచడం ఆచారం. వినాయక చతుర్థి రోజున వినాయకుడి విగ్రహాన్ని ఇంటిలో ఉంచుకుంటే ఏం చేయాలి? ఏం చెయ్యకూడదు? అనేది తెలుసుకుందాం. 
 
వినాయక చతుర్థి రోజున ఏ విగ్రహాన్ని ఉంచినా.. ఖచ్చితంగా వినాయకుడి తలపై కిరీటం, గొడుగు వుండేలా చూసుకోండి. ఇలాంటి వినాయకుడిని వుంచడం ద్వారా అదృష్టం కలిసివస్తుంది.
 
ఇంట వుంచే వినాయక విగ్రహం కూర్చున్నట్లు గల వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. నిల్చుని వున్నట్లు గల వినాయకుడి బొమ్మను ఇంట వుంచి పూజించకూడదు. వినాయకుడి విగ్రహంతో పాటు మోదకం, ఆయన వాహనమైన ఎలుక తప్పకుండా వుండాలి. ఇవి వుంటే ఆ ఇంట ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. 
 
ఇంట్లో వుంచి పూజించే విగ్రహానికి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. వినాయకుడి విగ్రహం ఇంట్లో తెచ్చుకున్న తర్వాత.. ఉల్లి, వెల్లుల్లి, మాంసం వంటివి తినకూడదు. కర్పూర హారతి ఇచ్చిన తర్వాతే నీటిలో నిమజ్జనం చేయాలి. ఇంట్లో వినాయకుడు వున్న రోజుల్లో ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి.