ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన అమర రాజ సంస్థ

Amara raja battery
సిహెచ్| Last Modified ఆదివారం, 9 మే 2021 (16:54 IST)
రేణిగుంట/తిరుపతి: - ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ గత శుక్రవారం జారీచేసిన ఆదేశాల ప్రకారం అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ చిత్తూరు జిల్లా లోని నూనెగుండ్లపల్లి మరియు కరకంబాడి ఫాక్టరీలలో ఉత్పత్తి కార్యకలాపాలను శనివారం, మే 8, 2021 నుండి తిరిగి ప్రారంభించింది.

పర్యావరణము, భద్రత మరియు ఆరొగ్య వ్యవస్థలకు అత్యధిక ప్రాధాన్యత కొనసాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సహకరించి ఏ విధమైనటువంటి సమస్యలనైనా పరిష్కరించే దిశలో సంస్థ తరపున కార్యాచరణ చేపడుతోంది. గత కొద్దిరోజులుగా ఉన్న తాత్కాలిక అంతరాయం వల్ల కంపెనీ కార్యాలాపాలపై ఎటువంటి ప్రభావం లేదని మరియు సంస్థ ఉత్పత్తులను యధావిధిగా అందించగలమని భాగస్వాములందరికీ హమీ ఇచ్చింది.

కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, "సంస్థ వినియోగదారులకు మా వస్తువులను, సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా సకాలంలో సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలూ తీసుకున్నాము. అలాగే ఈ స్వల్పకాలిక అంతరాయం యొక్క ప్రభావాన్ని అంచనా
వేసుకుంటున్నాము. మాపై ఎంతో విశ్వాసం ఉంచిన సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, విక్రయదారులు మరియు ఇతర భాగస్వాములందరికి ఈ సందర్భంగా
కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాము. వారి అంచనాలకు తగినట్లుగా పనిచేయడనికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే వుంటాము" అని వెల్లడించారు.

బాధ్యతాయుతమైన సంస్థగా, పర్యావరణ పరిరక్షణ మరియు ఉద్యోగుల ఆరోగ్యం మరియు భద్రతకు అమర రాజ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తుంది. తమ కార్యకలాపాలన్నిటిలోను
శ్రేష్ఠతా ప్రమాణాలను పాటించడం సంస్థ అనుసరిస్తున్న విలువలలో అంతర్భాగమని
దీనికి అణుగుణంగా అన్ని నియమ నిబంధనలకు తమ సంస్థ కట్టుబడి ఉంటుందని తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
దీనిపై మరింత చదవండి :