మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (12:46 IST)

టమోటాలను రోడ్డున పారేస్తున్న రైతులు.. నిరసన- ట్రాఫిక్ జామ్

Tomatoes
Tomatoes
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని టమోటా రైతులు తమ పంటను రోడ్డున పడేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు ఒక రూపాయికి పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో టమాటో రైతులు తమ పంటను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. 
 
దీని ఫలితంగా గూటి-మంత్రాలయం రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా తమను రక్షించాలని నిరసన తెలిపిన రైతులు డిమాండ్ చేశారు. తమకు సహాయం చేయడానికి ఈ ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
 
62,000 హెక్టార్లలో హెక్టారుకు 41.22 టన్నుల టమోటా ఉత్పాదకతతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో టమోటా దిగుబడి 22.17 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. కర్నూలులో మాత్రమే, సుమారు 4,800 హెక్టార్లలో టమోటాలు పండిస్తారు. సంవత్సరానికి సుమారు 1,67,591 టన్నుల దిగుబడి వస్తుంది.
 
ప్రతి సంవత్సరం టమోటాలు రెండు సీజన్లలో ఉత్పత్తి అవుతాయి. ఆగస్టు నుండి అక్టోబర్ (ఖరీఫ్), డిసెంబర్ నుండి ఏప్రిల్ (రబీ) వరకు వుంటుంది. పత్తికొండ హోల్‌సేల్ మార్కెట్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లి తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద టమోటా మార్కెట్.
 
మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల కారణంగా పత్తికొండ ప్రాంతంలో టమోటా రైతులు నష్టపోతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దూదేకొండలో 2.5 ఎకరాల భూమిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ. 11 కోట్లు కేటాయిస్తూ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది.
 
గత సంవత్సరం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గత నెలలో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉల్లిపాయలు టమోటా ధరలు బాగా పడిపోయిన తర్వాత టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పంట ధరలను అట్టడుగు స్థాయికి నెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకొల్పిన రికార్డులను ఎవరూ సాధించలేరని జగన్ తెలిపారు.