బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (09:02 IST)

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే 'గోల్డెన్ లేడీ'

లాక్‌డౌన్ స‌మ‌యంలో చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జినికి ఐరోపా ఖండం క్రోయేషియా దేశం నుంచి అరుదైన గౌర‌వం ద‌క్కింద‌ని చిల‌క‌లూరిపేట‌కు చెందిన జ‌య‌జ‌య‌సాయి ట్ర‌స్టు, మ‌నం ఫౌండేష‌న్ చైర్మ‌న్ పూసపాటి బాలాజి తెలిపారు.

ముంబైకి చెందిన ఏకే తెలుగు మీడియా సైతం గోల్డెన్ లేడీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌స్కారం అంద‌జేసింద‌ని చెప్పారు. ఈ రెండు పుర‌స్కారాల‌ను త‌మ ఫౌండేష‌న్ ద్వారా ఎమ్మెల్యేకి అంద‌జేసే అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిపారు.

ఐరోపా ఖండం క్రోయేషియా దేశానికి చెందిన హెచ్ ఆర్ హెచ్ ప్రిన్స్ ల‌వ్‌డాటోర్డో, విద్యావేత్త అంబ్‌, ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఇవాన్ గ‌సినాల‌తో కూడిన త్రిసభ్య క‌మిటీ చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేకు గోల్డెన్ లేడీ ఆఫ్ ఇండియా అవార్డు ఇవ్వాల్సిందిగా ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు.

పుర‌స్కారాన్ని అంద‌జేసే బాధ్య‌త‌ను త‌మ ఫౌండేష‌న్‌కు అప్ప‌గించార‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వ‌ర‌రావు, అడపా రవి,  పాల్గొన్నారు.