బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:34 IST)

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : సీపీఐ నారాయణ

narayana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేదని, రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయంటూ హైదరాబాద్ వేదికగా జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవిస్తానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీలో మాత్రం రోడ్డు గుంతలమయంగా ఉంటే పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్డు చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. 
 
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామమైన అయనంబాక్కం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ చెప్పడం గమనార్హం. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు.