మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (15:06 IST)

నీళ్లే ఇవ్వనన్నావ్.. ఇక ఏపీలో టీఆర్ఎస్ పార్టీనా?: కేసీఆర్‌కు రామకృష్ణ చురకలు

ఏపీలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా వుందని.. ఏపికి నీళ్ళు ఇవ్వదని చెబుతూ టిఆర్ఎస్‌ను ఏపీలో ఎలా స్థాపిస్తావని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. సీఎం కెసిఆర్ పగటి కలలు మానుకోవాలని చురకలు అంటించారు
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటి పడి నిత్యావసర ధరలు పెంచుతున్నాయని… విద్యుత్ చార్జీల, పెట్రోల్ డీజిల్ రోజు రోజుకు పెరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రోజు నిత్యావసర ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించలేదు. రైల్వే ఛార్జీలూ పెంచారని మండిపడ్డారు.
 
ఏపీలో సీఎం జగన్ ఆస్తి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలను పెంచారని ఫైర్‌ అయ్యారు. 28వ తేదీన నిరసన దీక్షలు చేపడుతున్నామని.. విద్యా రంగాన్ని సీఎం జగన్ రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ ఒడిని ఎగ్గొట్టేందుకు జగన్ చర్యలు చేపట్టారని నిప్పులు చెరిగారు.