శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (16:03 IST)

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాం : ఈడీ దూకుడు

enforcement directorate
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఛైర్మన్, డైరెక్టరుతో సహా 26 మందికి నోటీసులు పంపించారు. ఇలా నోటీసులు పంపించిన వారివద్ద సోమవారం నుంచి విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన నిధుల్లో రూ.234 కోట్ల మేరకు నిధులను మళ్లింపునకు సంబంధించిన ఈడీ కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావులతోపాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ అయింది. వీరి వద్ద సోమవారం నుంచి హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో విచారణ జరుగనుంది.
 
కాగా, ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దుర్వినియోగం అయినట్టు గుర్తించిన ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం సీఐడీ విచారణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈడీ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై దృష్టిసారించి, లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది.