సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (19:03 IST)

జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయా... జస్టిస్ ఈశ్వరయ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య. జగన్ ఏమన్నా పతివ్రతా అంటూ విమర్సించారు. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని, జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయానన్నారు. జగన్ బిసిల ద్రోహని, వైసిపి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. 
 
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, విజయసాయిరెడ్డికి బిసిల రిజర్వేషన్ల గురించి ఏం తెలుసునని, రిజర్వేషన్ ఇస్తామని బిసిలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. శరీరం అమ్ముకున్నవారికి నీతి, విలువ ఉంటుందని, రాజకీయనాయకులకు ఆ విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఈశ్వరయ్య. 
 
అగ్రవర్ణాలకు ఓటెయ్యవద్దని బిసిలకు పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య. చంద్రబాబు నాయుడు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని, స్టేలు తెచ్చుకుని ఆయన తిరుగుతున్నారని, తెలంగాణాలో కెసిఆర్, ఎపిలో చంద్రబాబు నాయుడులు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆరోపణలు చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందన్నారు జస్టిస్ ఈశ్వరయ్య.