ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 మార్చి 2024 (18:25 IST)

పొరుగు రాష్ట్ర పోలీసులు అలా చెబుతుంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా?: చంద్రబాబు

chandrababu naidu
దేశంలో ఎక్కడ గంజాయి కేసులు వెలుగుచూసినా ఆ కేసు మూలాలు ఏపీలో వుంటున్నాయనీ, ఇది దౌర్భాగ్యకరమైన విషయం అంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాసారు.
 
''ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయి. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖ లోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా? ఈ అధికారులకు అవమానకరం కాదా?
 
దేశంలో ఎక్కడ ఏ గంజాయి కేసుకైనా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం జగన్ రెడ్డి పాలనా దౌర్భాగ్యం. నిన్ననే 25,000 కిలోల డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడ్డాయి. రాష్ట్రాన్ని ఇలా అభాసుపాలు చేసిన జగన్ గ్యాంగ్ పాపాలకు ప్రజలే శిక్ష విధిస్తారు. నాడు అభివృద్దిలో దేశంలో వెలిగిన మన రాష్ట్రం...నేడు గంజాయితో చీకట్లలోకి వెళ్ళిపోయింది.''