మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (11:46 IST)

ఓటు నమోదుకు మరో అవకాశం..

తాజాగా ఓటు నమోదుకు మరోమారు అవకాశం ఎన్నికల కమీషన్‌ కల్పించింది. మరో మూడు నెలల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం యువతీ, యువకుల్లో ఉత్సాహం నింపుతుంది. 2020 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వజ్రాయుధం లాంటి ఓటుహక్కును సొంతం చేసుకోవచ్చు. 
 
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులతో పాటు నూతన ఓటు నమోదుకు అవకాశం కల్పించడం జరిగింది. అధికారులు సైతం ఆ కోణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల వారీగా బీఎల్వోల వద్ద నూతన ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాక మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశం ఉంది.