మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (11:24 IST)

స్వరూపానందస్వామికి బ్లాక్‌మెయిల్‌ చేయడం అలవాటే: శ్రీనివాసానంద సంచలన ఆరోపణలు

శారదా పీఠాధిపతి స్వరూపానందపై ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఓ తెలుగు ఛానల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. తీవ్ర విమర్శలు చేశారు.

ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేయడం స్వరూపానందస్వామికి అలవాటేనని ఆరోపించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరిగినా స్వరూపానందస్వామి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

తిరుమలలో స్వరూపానంద పీఠం పెట్టుకుని ఏం దైవకార్యాలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. తిరుమలలో పీఠాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని శ్రీనివాసానంద ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు దేవాలయ భూములు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇతర ప్రార్థనామందిరాలకు మాత్రం స్థలాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.