కుమారుడిని సంసారానికి పనికిరాకుండా చేసిందనీ కోడలు హత్య?
కర్నూలు జిల్లాలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీ కుమార్తెను గుర్తు తెలియని దండగులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక భవనంలోని పై అంతస్తులో తల్లిని, కింది అంతస్తులో కుమార్తెను హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
అలాగే, హత్యకు గురైన వారిని రుక్మిణి, రమాదేవిలుగా గుర్తించారు. కాగా, ఈ జంట హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర రావుకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈయన కోలుకుంటేగానీ ఈ హత్యలకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.
కాగా, కర్నూలుకి చెందిన శ్రావణ్‌కు రుక్మిణిని ఇచ్చి వివాహం చేసారు. హైదరాబాద్ నగరంలో బ్యాంకు ఉద్యోగం చేస్తూ వచ్చిన శ్రవణ్‌కు ఆపరేషన్ తర్వాత వివాహమైంది. దీంతో తన కుమారుడిని సంసారానికి పనికిరాకుండా చేశావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్.. కోడలు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిలను హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.