బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (17:53 IST)

తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్‌డౌన్, గోవిందుడి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఏడుకొండల స్వామి నిలయం ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దిగువ ఉన్న టెంపుల్ టౌన్ తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్డౌన్ పొడిగించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో తిరుపతి లాక్ డౌన్ పొడిగించారు.
 
అయితే తిరుమల వెళ్లే ఏడుకొండల స్వామి భక్తులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా, వారికి ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. గోవిందుని దర్శనానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్ సడలింపు ఉంటాయని అధికారులు తెలిపారు.
 
తిరుమల కొండకు వెళ్లే భక్తులు వారివారి వాహనాల్లో తిరుపతి బైపాస్ రోడ్డు మీదుగా తిరుమలకు ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసారు. తిరుమల ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ప్రజలు సైతం తిరుమల వెళ్లే భక్తులకు సహకరిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు.