శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (18:25 IST)

పెళ్లైనా ఒంటరి జీవితం.. ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. చివరికి చున్నీకి ఉరేసుకుని..?

పెళ్లై ఒంటరిగా బతికారు.. ఆపై ప్రేమలో పడ్డారు. చివరికి వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఒకే చున్నీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాల సురేష్, తణుకు ఉమా సరోజినిలు ఒకే చున్నీకి ఉరేసుకొని ఆత్

పెళ్లై ఒంటరిగా బతికారు.. ఆపై ప్రేమలో పడ్డారు. చివరికి వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఒకే చున్నీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాల సురేష్, తణుకు ఉమా సరోజినిలు ఒకే చున్నీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ వివాహం అయినా తమ తమ భాగస్వాములకు దూరంగా వుంటున్నారు. ఈ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. 
 
మూడు రోజుల క్రితం ఈ జంట ఇంటినుండి పారిపోయారు. కానీ చివరకు ఆత్మహత్యకు పాల్పడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులోని కోనేరుపేటకు చెందిన నంద్యాల సురేష్‌కు కైకరానికి చెందిన నాగలక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు. కుమార్తె ఉన్నారు. అయితే అదే వీధికి చెందిన జొన్నాడ ఉమాసరోజినికి తణుకు మండలం కాయలపాడుకు చెందిన తణుకు సుబ్బారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సురేష్ భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. సరోజిని కూడ తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది.
 
వీరిద్దరూ అదే ప్రాంతంలో నివాసం ఉండడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇద్దరిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సురేష్, సరోజిని మూడు రోజుల పాటు క్రితం గ్రామం నుండి పారిపోయారు. కానీ శుక్రవారం కోనేరు పేటలోని ఓ పూరిగుడిసెలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.