శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (16:05 IST)

దత్తత తీసుకున్న గ్రామంలో ఎమ్మెల్యే రోజా ఉచిత వైద్య శిబిరం

చిత్తూరు జిల్లా నగరి మండలం మీరాసాహెబ్ పాలెం గ్రామం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ లో ఎమ్మెల్యే రోజా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోజా దత్తత తీసుకున్నఈ గ్రామంలో పంచాయతీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా ఈ  మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

 
త‌న నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో మెగా వైద్య శిబిరం నిర్వహించి అక్కడున్న ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చ‌ర్య‌లు తీసుంటున్న‌ట్లు ఎమ్మెల్యే రోజా చెప్పారు. చిన్న జబ్బులకు అక్కడే వైద్యం చేసి మందులు ఇవ్వటం, ఒక వేళ సర్జరీ అవసరమైతే అది కూడా ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. అదే కాకుండా ఈ గ్రామం చుట్టుపక్కల కంటి చూపు సమస్యలు వున్నవారు ఎవరైనా ఉంటే,  వారికి కూడా ఉపయోగపడే విధంగా అరవింద్ కంటి ఆసుపత్రి వారిని ఈ మెగా శిబిరంలో పాల్గొనేలా చేశామ‌న్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా సాయంత్రంలోపు ఉచితంగా ఇవ్వనున్నట్లు రోజా తెలిపారు.

 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా, ఒక డాక్టరుగా, ఒక ప్రజా నాయకురాలిగా గ్రామ ప్రజలకు మంచి వైద్య సౌకర్యం అందించడానికి సంకల్పించారు. గ్రామస్థులంతా రోజా మేలు గుర్తు పెట్టుకొని ఎప్పటికీ ఋణపడి వుంటామని తెలిపారు.