గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (10:05 IST)

టీటీడీలో రూ.50 కోట్ల పాతనోట్లు.. మార్పిడికి అవకాశం ఇవ్వండి ప్లీజ్.. కేంద్రమంత్రికి సుబ్బారెడ్డి వినతి

భక్తులు విరాళంగా ఇచ్చిన వాటిల్లో రూ.50 కోట్లు పాతవి వున్నాయని, వాటి మార్పిడికి అవకాశం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. భక్తులు తమ కానుకలు డబ్బుల రూపంలో వాటిని మార్చేందుకు అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా టీటీడీకి రెవెన్యూ లేదని, 
 
కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని, ఏపీ జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తక్షణమే నిధులు ఇవ్వాలని వైవీ కోరారు.