శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

పాపం.. బిడ్డలు బాగా భయపడినట్టున్నారు.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

amarnath reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆదివారం ఒక్కసారిగా మారిపోయాయి. హైదరాబాద్ నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో జనసేన పార్టీ చీఫ్, హీరో పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి దాదాపు రెండున్నర గంటల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. వీరిద్దరి సమావేశంతో వైకాపాలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అంతే.. ఏకంగా ఏడుగురు మంత్రులతో విమర్శల చేయించారు. వీరికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా ధీటుగానే స్పందించారు. 
 
"చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలిస్తే మాకు భయం లేదని చెప్పడానికి వైకాపా నుంచి అంతమంది బయటకొచ్చారంటే బిడ్డలు బాగా భయపడినట్టున్నారు" అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ట్వీట్ చేశారు. వైకాపాకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప వ్యాఖ్యానించారు. 
 
కప్పు కాఫీ.. జగన్ ముఠాను మూడు చెరువుల నీళ్లు తాగించింది.. 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ నగరంలో భేటీ అయ్యారు. ఈ భేటీపై వైకాపా నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. సంక్రాంతి వసూళ్ల కోసం కలిశారని ఒకరంటే.. సంక్రాంతికి గంగిరెద్దులు ఇంటికి వెళతాయని మరో మంత్రి అన్నారు. ఇలా ఏకంగా పదికిపైగా వైకాపా మంత్రులు ఈ భేటీపై నోరు పారేసుకున్నారు. వీరు చేసిన దాడికి టీడీపీ నేతలు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఒక్క టీ కప్పు కాఫీ జగన్ ముఠాను మూడు చెరువులు నీళ్లు తాగించిందంటూ తేల్చేశారు.
 
ఇదే అంశంపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు - పవన్ కళ్యాణ్‌లు ఓ కప్పు టీ తాగితే జగన్ ముఠా భయంతో మూడు చెరువులు నీళ్లు తాగిందన్నారు. బాబు, పవన్ కలిస్తే ఏడుగురు మంత్రులతో అబద్ధాల దాడి చేయించటారంటే జగన్ రెడ్డికి ఎంత వణికిపోతున్నారో అర్థమైపోతుంది అన్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ఫోటోను ట్యాగ్ చేసి ఆ ఇద్దరూ ఓ కప్పు కాఫీ తాగారు. వైకాపా వాళ్లంతూ మూడు చెరువులు నీళ్లు తాగారు అంటూ మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. బాబు, పవన్ కలిస్తే మాకు భయం లేదని చెప్పడానికి వైకాపా నుంచి అంత మంది మంత్రులు బయటకు వచ్చారంటే .. పాపం బిడ్డలు బాగా భయపడిపోతున్నారంటూ మాజీ హో మంత్రి నిమ్మకాయల రాజప్ప అన్నారు.