గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (12:36 IST)

అమ్మఒడి డబ్బులకు నాన్న బుడ్డీతో లెక్క సరిచేస్తున్న సీఎం జగన్ : గంటా సెటైర్లు

ganta srinivasa rao
అమ్మఒడి పేరుతో ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకు నాన్న బుడ్డీతో లెక్క సరిచేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ, కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెట్టి పేదోడిని దోపిడీ చేస్తున్న మీకు బుద్ధి చెప్పడానికి అదే పేదోడు సిద్ధంగా ఉన్నాడు జగన్ అని గంటా ధ్వజమెత్తారు. 
 
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు నో ఛాన్స్ అని మాజీ మంత్రి గంటా ఎద్దేవా చేశారు. అంతా నగదు మయం. ఏంటీ రహస్యం. ఈ డబ్బంతా ఎక్కడికి చేరుతుందని జగనన్నా.. వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇంత విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మి పెదోడిని దోపిడీ చేసిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్రలు తిరగేసినా దొరకరేమో అని గంటా తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించారు. 
 
రేట్ల సంగతి దేవుడెరుగు... బ్రాండ్లన్నీ.. భ్రాంతిలా మార్చారు. నిఖార్సైన సరకుకు ఏనాడో స్వస్తి పలికారు. ఐదేళ్లుగా జే బ్రాండులతో హానికారక మత్తును మద్యంబాబుల శరీరాల్లో నింపారు. మద్యం నిషేధం అమలు చేసి ఓటు అడుగుతానన్న హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయాన్ని చూపిస్తూ 15 యేళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మీది నాసికరకం మద్యం వల్ల 35 లక్షల మంది రోగాలు బారినపడ్డారు. అందులే 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగిని కరిచిన ఎలుక.. ఎక్కడ? 
 
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన జరిగింది. మెదకుడు సంబంధించిన  సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్‌ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచింతి. చేతివేళ్లు, కాళ్లను ఎలుక కొరకడంతో గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్శింహా వెంటనే స్పందించారు. వైద్య విధాన పరిషత్ కమిషన్ డాక్టర్ అజయ్ కుమార్‌ను విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి హుటాహుటిన కామారెడ్డికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికెళ్లి పరిశీలించారు. 
 
ఐసీయూ వార్డులో రోగి చికిత్స పొందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలుక కరిచిన ఆనవాళ్లను, ఎలుకలు, ఐసీయూ వార్డులోకి ఎలా వచ్చాయని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడి భా్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత రికార్డులను పరిశీలించిన ఆయన స్థానిక మీడియాకు వెల్లడించారు. అయితే, విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన వింటే ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకునేలా ఉంది. 
 
వారం రోజులుగా బాధితుడు కోమాలోనే ఉన్నారు. స్పృహలో కూడా లేరని చెప్పారు. ఐసీయూ వార్డులోకి ఎలుకలు రావడానికి స్థానికంగా జరుగుతున్న నిర్మాణ పనులు, రోగి బంధువులు తిని పడేసిన అన్నం మెతుకులే కారణమని చెప్పారు. దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యాన్ని రోగులకు ఆపాదిస్తూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ఇచ్చిన వివరణకు అందరూ ఆశ్చర్యపోయారు.
 
కాగా, రోగిని ఎలుక కరిచిన ఘటనపై కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించగా.. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ త్రివేణి నలుగురిపై చర్యలు తీసుకున్నారు. వైద్యురాలు కావ్య, ఇన్‌చార్జి జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు సంపత్‌కుమార్‌, స్టాఫ్‌నర్స్‌ మంజులను సస్పెండ్‌ చేయగా, సూపరింటెండెంట్‌ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.