శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (18:58 IST)

కుమార్తెను బయటకు తీసుకొచ్చాను.. పట్టాభి వీడియో రిలీజ్

తన ఇంటిపై వైకాపా నేతలు దాడులకు తెగబడటంతో తన కుమార్తె తీవ్రమైన మనోవేదనకు గురైందని, ఆమెను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు కాస్త బయటకు తీసుకొచ్చానని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు. 
 
అదేసమయంలో తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించి తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. 
 
తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చానని ఆయన తెలిపారు. తర్వలోనే మళ్లీ వచ్చి పార్టీలో క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తానన్నారు. 
 
కాగా, జైలు నుంచి విడుదలైన తర్వాత పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన తాజాగా ఓ విమానంలో వెళుతూ కనిపించారు. దీనిపై పట్టాభి ఒక వీడియో రిలీజ్ చేశారు.