1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (17:57 IST)

అమరావతి అగ్గి మీద 'విజయసాయిరెడ్డి' గుగ్గిలం, సీఎం జగన్ అదే చేస్తారా?

ఇప్పటికే రాష్ట్రం అట్టుడుకుతోంది. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారంపై రాష్ట్రంలోని విపక్షాలన్నీ ఆందోళన బాట పట్టాయి. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి కారణమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప అధికార వికేంద్రీకరణ కాదంటూ ప్రతిపక్షాలన్నీ మండిపడ్డాయి. అయినాసరే సిఎం పట్టించుకోలేదు.
 
గత పది రోజుల నుంచి రాష్ట్రంలోని 13జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుండగా, అమరావతి వేదికగా రైతులు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కీలక కేబినెట్ సమావేశం జరుగుతోంది. అయితే విజయసాయిరెడ్డి ఒక్కరోజు ముందుగానే కీలక ప్రకటనలు చేసేశారు.
 
ఇంకేముంది.. మన రాజధాని వైజాగ్. ప్రకటన రేపే. మీరందరూ హ్యాపీగా ఉండండి. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 3వేల ఎకరాల చూసేశాం. కొన్ని అద్దె భవనాలను కూడా చూశాం. నెల రోజుల్లో అమరావతి మొత్తాన్ని మార్చేస్తాం. అనుకున్నది చేసేస్తున్నాం అంటూ పిచ్చాపాటి మాట్లాడారు. ఇప్పటికే జనం మండిపోతుంటే.. వారిని మరింత ఆగ్రహం గురిచేసేలా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
కాగా విజయసాయి రెడ్డి చెప్పినట్లుగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసేసుకుంటారా అనే చర్చ మొదలైంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.