బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (09:27 IST)

దేశ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఎందుకో తెలుసా?

దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఆంధ్రప్రదశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల ప్రజలకు ఈ హెచ్చరికలు చేసింది. ఈ నెల 7, 8వ తేదీల్లో అక్కడక్కడా వడగళ్ళ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, తెలంగాణ, యానాం తీర ప్రాంతాలతో పాటు పశ్చి బెంగాల్ గంగానది పరివాహక ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఉత్తర కర్నాటక, ఒడిశా, మహారాష్ట్రలోని విదర్భతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. 
 
అయితే, ఏప్రిల్ 7, 8వ తేదీల్లో వడగాల్పులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వెస్ట్ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్ళ వర్షం కురుస్తుందని పేర్కొంది. కాగా, ఈ యేడాది దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ ఇదివరకే హెచ్చరించిన విషయం తెల్సిందే. 
 
సొంత కారు లేని రాహుల్... ఆస్తులు ఎంతో తెలుసా?
 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సొంత కారు లేదు. సొంతంగా రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా లేదు. ఆయన ఆస్తి విలువ రూ.20 కోట్లు మాత్రమే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. దీంతో బుధవారం ఆయన అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో సొంత కారు, రెసిడెన్షియల్ ఫ్లాట్ వంటివి లేవని, తన ఆస్తి రూ.20 కోట్లని పేర్కొన్నారు. తన చేతిలో రూ.55 వేల నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు. అలాగే, రూ.4.33 కోట్ల విలువ చేసే బాండ్లు, షేర్లు, రూ.3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల బంగారు బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన నగలు సహా రూ.9.24 కోట్ల చరాస్తులున్నట్టు అఫిడవిట్‌‍లో పేర్కొన్నారు. రాహుల్ రూ.11.15 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నారు. 
 
ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉంది. గురుగ్రామ్ రూ.9 కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, అత్యాచార బాధిత కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతోపాటు బీజేపీ నేతల ఫిర్యాదుపై పరువునష్టం కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించి నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదైనట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా సీపీఐ నేత అన్నీ రాజా, రాష్ట్ర బీజేపీ సుందరన్ బరిలో ఉన్నారు. కేరళలో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.