బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (00:42 IST)

13-11-2022 నుంచి 19-11-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. శుక్ర, శనివారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. యత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆత్మీయుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రాని బాకీలు వసూలవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆదివారం నాడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ డనట్లు వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
మనోధైర్యంతో మెలగండి. పరిస్థితుల్లో నిదానంగా మార్పు వస్తుంది. వీలైనంత వరకు ఆప్తులతో గడిపేందుకు యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సహాయం అందిస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సోమ, మంగళవారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. హోల్‌సేల్ వ్యాపారులకు బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
మీకు సత్కాలం సమీపిస్తోంది. ఆలోచలను కార్యరూపంలో పెట్టండి. అవకాశాలను వదులుకోవద్దు. ధనలాభం ఉంది, కొన్ని అవసరాలు తీరుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. ఆది, గురువారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఒక సమాచారం ఉతేజపరుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఈ వారం శుభదాయకం. అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి సహాయం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. సంతానం దూకుడు అదుపుచేయండి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. దూర ప్రదేశ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యం ఉంది. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. దైవరార్యాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. శుక్ర, శనివారాల్లో నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ జీవిత భాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయండి. పత్రాలు అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
కార్యసిద్ధి, వాహనయోగం ఉన్నాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. కంప్యూటర్ ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అనుకూలతలు అంతంతమాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలడదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు.. ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఆధ్మాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులు సాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. గురువారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
అన్ని విధాల శుభదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శనివారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పత్రాల రెన్యువల్‍‌లో మెలకువ వహించండి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అవరోధాలు తొలగుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలు అధికం. తప్పటడుగు వేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఏ విషయానికి నిరుత్సాహపడవద్దు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. మనోధైర్యంతో మెలగండి. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆది, సోమవారాల్లో పనుల ప్రారంభాలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులు శుభవార్తలు వింటారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.