శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:58 IST)

చర్మ వ్యాధులకు దివ్యౌషధం పైనాపిల్ రసం

పైనాపిల్‌లో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలుంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చ

పైనాపిల్‌లో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలుంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చే మెగ్నీషియం ఇందులో మెండుగా ఉంటుంది. ఇది ఎముక దృఢత్వానికి సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. 
 
యాంటీ ఆక్సిడెంట్‌ పోషకాలు నోటి క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. పైనాపిల్‌లోని యాంటీ-ఆక్సిడెంట్లు నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగవుతుంది. మూత్రపిండాలకు చెందిన వ్యాధులతో బాధపడే వారికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. తెగిన గాయాలపై దీని రసం వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. పొగతాగడం వల్ల శరీరానికి కలిగే అనర్థాలను ఇది తొలగిస్తుంది. 
 
తాజా పైనాపిల్ రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి. చర్మ వ్యాధులకు పైనాపిల్ రసం అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయ ప్రక్రియను మెరుగు పరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.