మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: సోమవారం, 19 జూన్ 2017 (18:45 IST)

హిస్టీరియా వున్నవారు ఎలా వుంటారు...? ఏంటి వైద్యం?

వాడికి ఏమయినా హిస్టీరియానా... అంటూ కొంతమందిని చూసినప్పుడు చెపుతుంటారు పెద్దలు. ఈ హిస్టీరియా అనేది బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడటం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూచోవడం వంటి

వాడికి ఏమయినా హిస్టీరియానా... అంటూ కొంతమందిని చూసినప్పుడు చెపుతుంటారు పెద్దలు. ఈ హిస్టీరియా అనేది బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడటం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూచోవడం వంటివన్నీ ఉన్మాద వ్యాధి లక్షణాలు. పైత్యం ప్రకోపించడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. 
 
దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వల్లారి ఆకు లేక నీరు సాంబ్రాణి ఆకు, బూడిద గుమ్మడికాయ, వస, తెల్లగంటెన.. వీటి రసములలో దేనినైనా చెంగల్వకోష్ఠు చూర్ణమును తేనెకు కలిపి రోజూ తీసుకున్నచో ఉన్మాద రోగం తగ్గుతుంది. 
 
వల్లారి ఆకు లేక నీరు సాంబ్రాణి ఆకురసము వసపొడి, చెంగల్వకోష్ఠు చూర్ణము, శంఖపుష్పి చూర్ణము, స్వర్ణభస్మము కలిపి త్రాగుచున్న ఉన్మాదము, అపస్మారకము తగ్గుతుంది. 
 
ఇంగువ, సౌవర్చలవణము, త్రికటుకములు.. వీటిలో ఆవునెయ్యిని, నేతిని నాలుగురెట్లు గోమూత్రమును కలిపి పక్వమయ్యే వరకూ కాచి, దీనిని రోజూ త్రాగుతుంటే ఉన్మాద రోగం నయమవుతుంది.