శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 5 జనవరి 2021 (22:36 IST)

విపరీతంగా తుమ్ములు వస్తున్నాయా? ఐతే ఈ చిట్కా పాటిస్తే చాలు

కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటివారు మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణించి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మెత్తగా నమిలి మింగేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అలర్జీతత్వం తగ్గి సమస్యకు చక్కటి పరిష్కారం కలుగుతుంది.
 
అలాగే మూత్ర వ్యవస్థలో రాళ్లు వున్నట్లయితే మెంతిపొడి 100 గ్రాములు, నల్ల ఉలవలు వేయించి చేసిన పొడి 100 గ్రాములు కలిపి వుంచుకుని రోజూ రెండు పూటలా పూటకి 50 మి.లీ చొప్పున ముల్లంగి రసంలో 2 నుంచి 3 గ్రాముల చూర్ణాన్ని కలిసి సేవిస్తుంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు మొదలగు వ్యవస్థలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.