మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (18:01 IST)

చలికాలంలో నెయ్యిని పక్కనబెట్టేస్తున్నారా?

చలికాలంలో నెయ్యిని ఆహారంలో చేర్చుకుంటే అజీర్తి సమస్యలు ఉత్పన్నం అవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ చలికాలంలో నెయ్యిని వాడటం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. 
 
జీర్ణసమస్యలతో బాధపడేవారు.. రాత్రి నిద్రించేందుకు ముందు గోరు వెచ్చని పాలలో నెయ్యి కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. చలికి వణికిపోయేవారు.. ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా వంట్లో వేడి పెరుగుతుంది.
 
శీతాకాలంలో రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని నీటిలో పసుపు, కర్పూరం వేసి ముఖానికి చేతులకు రాసి ఓ పదినిమిషాల తర్వాత స్నానం చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
నెయ్యిని కాస్త పెదవులకు రాసుకుంటే మృదువైన కోమలమైన పెదవులు మీ సొంతం అవుతాయి. అలాగే చర్మ పగుళ్లకు నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది. ఒక స్పూన్ నెయ్యి, పసుపు వేసి రాసుకోవడం ద్వారా పగుళ్లు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.