గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (11:35 IST)

పైల్స్‌కు దివ్యౌషధం ముద్దబంతి పువ్వు.. చెవిపోటు తగ్గాలంటే?

ముద్దబంతి పువ్వు పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ పువ్వు కేవలం అలంకరణ కోసమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎలాగంటే.. ముద్దబంతి ఆకుల రసాన్ని తాగితే పైల్స్ నుంచి రక్తం కారడం నిలిచిపోతుం

ముద్దబంతి పువ్వు పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ పువ్వు కేవలం అలంకరణ కోసమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎలాగంటే.. ముద్దబంతి ఆకుల రసాన్ని తాగితే పైల్స్ నుంచి రక్తం కారడం నిలిచిపోతుంది. బంతిపువ్వుల నుంచి తీసిన పది మి.లీటర్ల రసాన్ని రోజూ మూడు పూటలా తీసుకుంటే  పైల్స్ నుంచి రక్తం కారడం ఆగిపోతుంది. పది గ్రాముల బంతి ఆకులు, రెండు గ్రాముల మిరియాలను మెత్తగా నూరి తింటే పైల్స్ సమస్య తగ్గిపోతుంది. 
 
250 గ్రాముల బంతి ఆకుల్ని, 250 గ్రాముల అరటి వేరును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు వాటి రసాన్ని తీసి రోజూ పది నుంచి 20 మి. లీ. రసాన్ని సేవించినట్లైతే పైల్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ బంతి ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే, పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
బంతి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు కూడా తగ్గిపోతుంది. అలాగే ఐదు నుంచి పది గ్రాముల బంతిపువ్వుల రేకులను నేతితో వేయించి రోజూ మూడు పూటలా తింటే పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.