శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (22:14 IST)

పాలలో నెయ్యి కలుపుకుని తాగడమా?

Milk_Ghee
పాలతో తయారయ్యే నెయ్యిని మళ్ళీ పాలల్లో కలుపుకోవడం తాగడమా.. అమ్మో ఇదేంటి అనుకుంటున్నారా? ఐతే తప్పకుండా ఈ స్టోరీ చదవండి. పాలు, నెయ్యిని కలుపుకుని తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అదెలాగంటే.. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండడంతీ నెయ్యిని సూపర్ ఫుడ్ ఆ పిలుస్తారు. అలాంటి నెయ్యిని పాలల్లో కలుపుకుని తాగితే కీళ్ళు బలపడతాయి. పాలల్లో ఉన్న విటమిన్ డి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి బాగా వంటబట్టడానికి నెయ్యి మేలు చేస్తుంది. 
 
ఎముకల కీళ్ళలో పుట్టే మంటని నెయ్యి తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఏదైనా పని చేసి అలసిపోయినట్లుగా అనిపిస్తే పాలల్లో నెయ్యి వేసుకుని తాగండి. అది మీకు బలాన్ని తెచ్చి పెట్టి శక్తివంతంగా ఉంచుతుంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఆవు పాలల్లో వేసి పొద్దున్న పూట తాగడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 
 
నెయ్యిని పాలల్లో తీసుకోవడం వల్ల ప్రతీ కణజాలానికి సరైన శక్తి అందుతుంది. దానివల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెంపొందించడానికి పాలల్లో నెయ్యి వేసి తాగించండి. గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎముకలకి బలం చేకూరుతుంది. పాలిచ్చే తల్లులకి బాగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.