సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. అటవీ అందాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (13:40 IST)

ప్రపంచ అటవీ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ప్రతి యేటా మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుతున్నారు. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 
 
తెలంగాణకు హరితహారం కింద అద్భుత ఫలితాలు సాధించామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. 
 
ఈ సందర్భంగా హరితయజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 
 
తొలిసారిగా 2014న విశ్వవ్యాప్తంగా అటవీ దినోత్సవం పాటించారు. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలుపడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
 
కాగా, ప్రపంచంలో అటవీ ప్రాంతం అధికంగా ఉన్న తొలి పది దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్న విషయం తెల్సిందే. భారత్‌తో పాటు మిగిలిన తొమ్మిది దేశాలు కలిసి 67 శాతం అటవీ ప్రాంతాన్ని కలిగివున్నాయి. మన దేశంలో అతిపెద్దదైన అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.