సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (10:59 IST)

పుదీనా రసాన్ని ముఖానికి రాసుకుంటే..?

చర్మం అందంగా ఉండాలని ఎవరు అనుకోరు.. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన పలురకాల సమస్యలను నయం చేసేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చర్మ సమస్యల నుండి విముక్తి పొందాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం..
 
మొటిమలు తగ్గించేందుకు టమోటా గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే మొటిమలు తొలగిపోయి.. ముఖం మృదువుగా తయారవుతుంది.
 
స్పూన్ పసుపులో కొద్దిగా పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని గంటపాటు అలానే ఉంచాలి. ఆపై వెచ్చని నీటితో కడుక్కోవాలి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేలా చేస్తాయి.
 
పుదీనాలో ఉండే మెంథాల్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు తొలగించుకోవాలంటే.. తాజా పుదీనా రసాన్ని ప్రతిరోజూ రాత్రి సమయంలో ముఖానికి రాసుకోవాలి. పుదీనా ఆకుల్లో 2 స్పూన్ల పెరుగు వేసి గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా వారంలో కొన్నిసార్లు చేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.