1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (17:05 IST)

అలసటను అందం కప్పేయాలంటే.. ఈ టిప్స్ పాటించండి!

పగలంతా ప్రయాణం చేసి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లగానే కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. కానీ అప్పుడే ఏ ఫంక్షన్‌కో, పార్టీకో వెళ్లాలంటే..  అలసటంతా ముఖంలోనే కనిపిస్తుంది. అలాంటి సమయంలో కొన్ని మేకప్‌ టిప్స్‌తో ముఖంపై ఉన్నఅలసటను ఇట్టే పోగొట్టవచ్చు. ఎలాగని ఇప్పుడు తెలుసుకుందాం!
 
ఓట్‌మీల్‌లో కొంచెం పాలు కలిపి ముఖానికి రుద్దుకొని చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కొద్దిసేపు ఐస్‌ ముక్కలతో ముఖంపై రుద్దుకొని, కళ్లపై పెట్టుకుంటే అలసట తగ్గుతుంది. 
 
కన్సీలర్‌ని  ముఖం మొత్తానికి కన్నా కళ్ల కింద పలచగా రాసుకోవడం వల్ల కళ్లు పెద్దగా ఫ్రెష్‌గా కనిపిస్తాయి. పార్టీలో మరింత అట్రాక్షన్‌గా కనిపించాలనుకుంటే మేకప్‌ వేసుకునేటప్పుడు మస్కారా వేసుకోవడం మరచిపోకూడదు. అలాగే చెంపలకి రోజ్‌క్రీమ్‌తో లైట్‌గా బ్లష్‌ చేస్తే మీ ముఖంలోని అలసటను అందం కప్పేస్తుంది. అందరి దృష్టి మీ వైపే ఉంటుంది.