శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (12:27 IST)

నిర్జీవ జుట్టుకు మంచి ఔషధం.. మందార పువ్వులు.. ఎలాగంటే?

జుట్టు రాలకుండా వుండాలంటే.. తలస్నానం చేయడానికి కనీసం గంటా, గంటన్నర ముందు తప్పనిసరిగా గోరువెచ్చని నూనె రాసి, మర్దన చేయాలి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్‌ నూనె సమపాళ్లల్లో తీసుకుని వేడి చేయాలి. ఈ మర్దన వల్ల మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరిగి, కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 
అలాగే రాత్రిపూట పెరుగులో ఐదు పెద్ద చెంచాల మెంతుల్ని నానబెట్టుకోవాలి. రెండూ కలిపి ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పట్టులా మారుతుంది.
 
కాలం ఏదైనా కొందరి జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గుప్పెడు మందారపూలను మెత్తగా నూరుకోవాలి. ఆ మిశ్రమానికి పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో రుద్దుకుంటే చాలు. జుట్టును మందార పువ్వులు దట్టంగా పెరిగేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.