గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (20:22 IST)

చర్మ సమస్యలకు మల్లె నూనె, దీనితో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఆధునిక శాస్త్రం ప్రకారం మల్లె నూనె చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో తేమ, వైద్య లక్షణాలు పుష్కలంగా వున్నాయి. ఇది చర్మం పొడిని నివారించి కాంతివంతంగా వుంచుతుంది. మల్లెల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. చర్మం పైన వున్న ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి.
 
జాస్మిన్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి?
జాస్మిన్ ఆయిల్ కొన్ని చుక్కలు తీసుకోండి.
బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో దాన్ని కలపండి.
చర్మ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు బాధిత ప్రదేశంలో మర్దన చేయండి.