బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. పుస్తక సమీక్ష
Written By Selvi
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2016 (16:07 IST)

షేక్‌స్పియర్‌కు అక్రమ సంతానం.. కానీ 11వ ఏటనే మరణించాడు.. నిజమా?

ప్రముఖ రచయిత విలియమ్ షేక్‌స్పియర్‌కు అక్రమ సంతానం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. షేక్‌స్పియర్ 400వ వర్థంతిని పురస్కరించుకుని షేక్‌స్పియర్స్ బాస్టర్డ్‌ను సైమన్ అండ్రూ స్టిర్లింగ్ రాశారు. 1604లో విలియమ్ దేవెనాంట్‌ను ఉద్దేశిస్తూ.. మై లవ్లీ బాయ్ (సానెట్ 126) అంటూ సాగే పద్యంలో షేక్ స్పియర్ రాశారనే అభిప్రాయాన్ని స్టిరింగ్ వ్యక్తం చేస్తున్నారు. 
 
1606లో జన్మించిన విలియం దేవెన్యాంట్‌ను ఉద్దేశించి రాసిందేనని పేర్కొన్నారు. దేవెన్యాంట్ తండ్రి షేక్‌స్పియర్ అనే విషయాన్ని ప్రముఖ కవులు అలెగ్జాండర్ పోప్, సర్ వాల్టర్ స్కాట్, విక్టర్ హ్యుగో ప్రస్తావించారని స్టిర్లింగ్ వెల్లడించారు. 
 
అలాగే షేక్‌స్పియర్, దేవెనాంట్ ఇద్దరి ముఖాలపై కనుబొమ్మ కిందికి వంగి ఉండే కొద్దిపాటి లోపాన్ని పుస్తకంలో ప్రస్తావించారని టైమ్స్ పత్రిక కూడా పేర్కొంది. షేక్‌స్పియర్, అన్నె హాథ్‌వే దంపతులకు ఒకే కుమారుడు ఉండేవాడని, అతను కూడా 11వ ఏటనే మృతిచెందాడని పుస్తకంలో పొందుపరిచారు. దేవెన్యాంట్ తల్లి జేన్ దేవెనాంట్ ఓ మద్యం దుకాణంలో యజమాని అని, ఆమె భర్త జాన్ ఓ మద్యం వ్యాపారి అని పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత జాన్ ఆక్స్‌ఫర్డ్ నగరానికి మేయర్ కూడా అయ్యారని ఆ పుస్తకంలో ఉంది. షేక్‌స్పియర్ కుమారుడు దేవెనాంట్ అనే విషయాన్ని సాహితీ, విద్యావేత్తలు బయటకు రాకుండా తొక్కిపెట్టారని షేక్‌స్పియర్స్ బాస్టర్డ్‌లో స్టిర్లింగ్ తెలిపారు.