గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (17:09 IST)

అమెరికా బ్యాంకు కుప్పకూలింది... 48 గంటల్లోనే పీకల్లోతు సంక్షోభం

SVB
SVB
అమెరికా బ్యాంకు కుప్పకూలింది. కేవలం 48 గంటల్లోనే పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికాకు చెందిన సిలికాన్ బ్యాంక్ (ఎస్‌వీబీ) నష్టాల్లో కూరుకుపోయింది. ఈ బ్యాంక్‌కు టెక్నాలజీ వెంచర్లు, స్టార్టప్‌లకు నిధులు అందిస్తుంది. అలాంటిది బ్యాంకు సంక్షోభం వార్తలు వైరల్ కావడంతో మదుపరులు 48 గంటల్లోనే 42 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో బ్యాంకు చేతులెత్తేసింది. 
 
క్యాలిఫోర్నియా రెగ్యులేటర్లు బ్యాంకును మూసేసి.. యూఎస్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నియంత్రణలోకి తీసుకువచ్చారు. సోమవారం నుంచి కస్టమర్లకు డిపాజిట్ల చెల్లింపులు చేస్తారు. బ్యాలన్స్ షీట్ ను బలోపేతం చేసుకునేందుకు 2.25 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాల్సిన అవసరం ఉందని బుధవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రకటించింది. ఈ ప్రకటనే బ్యాంకు మునిగిపోవడానికి నాందీ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.