గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

జూలైలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు...

gst collections
దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ప్రతి నెలా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జూలై నెలలో ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల మేరకు జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఇలా వసూలు కావడం ఇది వరుసగా ఐదో నెల. 
 
జీఎస్టీ నెలవారి వసూళ్ళలో వరుసగా రూ.1.40 కోట్లు దాటడం ఇది ఐదో నెల కావడం గమనార్హం. గత యేడాది జూలై నెలలో రూ.1.16 లక్షల కోట్లు మాత్రమే జీఎస్టీ వసూళ్ళు వచ్చాయి. ఇపుడు ఈ యేడాది జూలై నెలలో రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. 
 
అంతేకాకుండా, అత్యధిక జీఎస్టీ వసూళ్ళలో ఈ జూలై మాసం వసూళ్ళ రెండో స్థానంలో నిలిచింది. ఈ వివరాలను వెల్లడిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన ట్వట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ వసూళ్సు దేశ వ్యాపార కార్యక్రమాలు క్రమంగా పుంజుకుంటున్నాయనేందుకు నిదర్శనమి గుర్తుచేసింది.