ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (19:12 IST)

రైల్వేస్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు

railway station
రైళ్లల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే మరో నిబంధనను అమలులోకి తీసుకురానుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కూడా అన్ని రైల్వేస్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు అనేవి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించడం జరిగింది. 
 
ఇంకా అలాగే నగదు రహిత లావాదేవీలు కూడా జరిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇక ఆగష్టు 1వ తేదీ నుంచి రైల్వేస్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో కూడా నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో డబ్బులను స్వీకరిస్తారు. 
 
ఇక ఈ నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించడం జరిగింది.
 
దీని కోసం యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌లు ఇంకా అలాగే స్వైపింగ్ మెషీన్‌లను కలిగి ఉండటం కూడా తప్పనిసరిగా ఆదేశాల్లో వెల్లడించింది.