శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:01 IST)

కరోనా తెచ్చిన తంటా.. కోకాకోలా కోత.. ఉద్యోగులు ఇంటికి..?

coco cola
బ్రీవరేజ్ దిగ్గజం కోకాకోలా ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఉద్యోగులను తొలగించనుంది. అమ్మకాలు భారీగా తగ్గడంతో రీస్ట్రక్చరింగ్ చర్యల్లో భాగంగా కోకాకోలా రెండువేల మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. అమెరికాలోనే కోక్ దాదాపు 1,200 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 86,200 మంది సిబ్బంది ఉన్నారు. 
 
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కోకాకోలా నికర అమ్మకాలు 9 శాతం మేర తగ్గాయి. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు, వ్యాపారాన్ని పునర్నిర్మించుకునేందుకు, మరోవైపు తన పోర్ట్‌పోలియోను తగ్గించే ప్రణాళికను వేగవంతం చేయడం ద్వారా ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలని భావిస్తోంది. 
 
ఇప్పటికే ఇది తన ట్యాబ్, ఓఢ్వాల్లా బ్రాండ్ ఉత్పత్తులను కోకకోలా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆగస్టులోనే అమెరికా, కెనడా, ప్యూర్టారికో దేశాల్లో వాలంటరీ లే ఆఫ్ ప్యాకేజీని సంస్థ ప్రకటించింది. కరోనా సంక్షోభం నుండి గట్టెక్కే ఉద్దేశ్యంలో భాగంగా ఉద్యోగాల కోత వంటి వాటి కోసం 350 మిలియన్ డాలర్ల నుండి 550 మిలియన్ డాలర్ల మేరకు కోకాకోలా ఖర్చు చేయనుంది.