గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (17:48 IST)

కస్టమర్లకు షాక్.. రుణ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

hdfcbank
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
 
బ్యాంక్ తాజాగా రుణ రేట్ల పెంపు నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న వారిపై, అలాగే తీసుకోవాలని భావించే వారిపై కూడా ఎఫెక్ట్ పడనుంది. 
 
ఈఎంఐలు పెరిగే అవకాశం వుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) పెంచేసింది. కొత్త రుణ రేట్లు జూలై 7 నుంచి అమలులోకి వచ్చాయని వెల్లడించింది.