బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 15 మార్చి 2018 (20:48 IST)

పేటీఎం కొత్త సదుపాయం... బహుమతిగా బంగారం ఇవ్వవచ్చు...

హైదరాబాద్: సంపద నిర్వహణ ఆఫర్ పేటీఎం గోల్డ్‌లో భాగంగా భారతదేశపు అతి పెద్ద మొబైల్ మొదటి ఆర్థిక సేవల వేదిక పేటీఎం రెండు కొత్త సేవలు- గోల్డ్ గిఫ్టింగ్ మరియు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్‌ని ప్రారంభించింది. కస్టమర్లు ఇప్పుడు 24 క్యారట్ల 999.9 స్వచ్ఛత గల బంగారా

హైదరాబాద్:  సంపద నిర్వహణ ఆఫర్ పేటీఎం గోల్డ్‌లో భాగంగా భారతదేశపు అతి పెద్ద మొబైల్ మొదటి ఆర్థిక సేవల వేదిక పేటీఎం రెండు కొత్త సేవలు- గోల్డ్ గిఫ్టింగ్ మరియు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్‌ని ప్రారంభించింది. కస్టమర్లు ఇప్పుడు 24 క్యారట్ల 999.9 స్వచ్ఛత గల బంగారాన్ని ఒకరికొకరు వెంటనే పంపించవచ్చు. ఈ సౌకర్యం వినియోగదారులకు ఎంతో సౌలభ్యంగా వుంటుంది.
 
60 శాతం కంటే ఎక్కువగా పేటీఎం గోల్డ్ కొనుగోళ్లు టైర్ 2 మరియు 3 పట్టణాల నుంచి ముఖ్యంగా మిల్లీనియల్ అత్యధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. క్రమబద్ధమైన విరామాలతో రూ. 500 వరకు విలువ చేసే పేటీఎం బంగారం కొనుగోళ్లు పునరావృతమైనట్లు ఈ నివేదిక తెలియచేసింది. ఈ విధానానికి ఉన్న పారదర్శకత మరియు సరళత వల్ల దీర్ఘకాల ఆదాల కోసం పేటీఎం గోల్డ్‌ని తాము ప్రాధాన్యతనిచ్చే పద్ధతిగా వినియోగదారులు ఎంచుకుంటున్న ఈ పెరుగుతున్న పోకడని ఇది చూపిస్తోంది. 
 
తాము ఆదా చేయాలనుకుంటున్న బంగారం మొత్తం, వ్యవధి, ఫ్రీక్వెన్సీలని ఎంటర్ చేయటం ద్వారా తమ బడ్జెట్ మరియు అవసరం ప్రకారం బంగారంలో సౌకర్యవంతంగా మరియు క్రమబద్ధంగా ఆదా చేసుకోవటానికి పేటీఎం ఆధునిక గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ కస్టమర్లకి సహాయపడుతుంది. లాక్-ఇన్ సమయం లేని చేర్చబడిన సదుపాయంతో తమ గోల్డ్ పాస్ బుక్ ఉపయోగిస్తూ వారు తమ లావాదేవీలన్నింటిని సులభంగా గమనించవచ్చు. కస్టమర్లు తమ బంగారాన్ని ఎంఎంటీసీ పీఏఎంపీల 100% సురక్షితమైన, బీమా గల లాకర్లలో ఉచితంగా భద్రపర్చుకోవచ్చు మరియు తమ బంగారాన్ని ఏ సమయంలోనైనా బట్వాడా చేయించుకోవచ్చు. తయారీ మరియు లాకర్ ఛార్జీలు వంటి ఆఫ్ లైన్ బంగారం కొనుగోలుతో సంబంధమున్న అదనపు ఫీజుని ఇది నిర్మూలిస్తుంది మరియు కస్టమర్లకు దీర్ఘకాలం కోసం నమ్మకమైన మరియు సరసమైన బంగారం ఆదా చేసుకునే అవకాశాన్నిస్తుంది.
 
పేటీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ నితిన్ మిశ్రా ఇలా అన్నారు, 'ఖర్చుకి తగిన విలువ గల విధానంలో బంగారాన్ని డిజిటల్‌గా ఆదా చేసుకోవటంలో పేటీఎం వినియోగదారుల్ని ఆకర్షించటంలో విజయవంతమైంది. గోల్డ్ గిఫ్టింగ్, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ వంటి రెండు వేర్వేరు సంపద నిర్వహించే నిజమైన ఉత్పత్తుల్ని ఆరంభించినందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. గోల్డ్ గిఫ్టింగ్ - బంగారం బహుమతిగా ఇవ్వాల్సిన అవసరాన్ని తీరుస్తుంది. గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ - దీర్ఘకాలంలో సంపదని పోగు చేయటానికి క్రమబద్ధంగా స్వచ్ఛమైన బంగారాన్ని ఆదా చేయటానికి నమ్మకమైన మరియు సరసమైన మార్గాల్ని కేటాయిస్తుంది. ఈ ఏడాది, మేము ఈ ఆఫర్లని మరింతమంది కస్టమర్లకు అందించటానికి, వారి ఆదా చేసే అలవాట్లకు ఒక క్రమశిక్షణని తీసుకురావటానికి మరియు వారి ఆర్థిక లక్ష్యాల్ని సాధించటంలో సహాయపడటానికి మేము దృష్టి కేంద్రీకరిస్తాము.'