గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (08:58 IST)

భారత మార్కెట్‌లోకి కాంపా.. పెప్సీ, కోకాకోలాకు కాలం చెల్లినట్లే

Campa cola
Campa cola
భారత మార్కెట్‌లో పెప్సీ, కోకాకోలాకు కాలం చెల్లినట్లే. ఎందుకంటే.. మార్కెట్లోకి కొత్త బ్రాండ్ లాంచ్ కానుంది. ఆ బ్రాండ్ తెస్తుంది ఎవరో కాదు.. ఆసియా కుబేరుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ. తాజాగా ఆ కంపెనీ ఢిల్లీకి చెందిన కాంపా, సోస్యో సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. 
 
ఇవి ప్యూర్ డ్రింక్ గ్రూప్ చేతిలో ఉన్నాయి. రూ.22 కోట్లకు కొనుగోలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నామని రిలయన్స్ ప్రకటించిన రెండురోజుల్లోనే ఈ కొనుగోలు జరగడం గమనార్హం. పెప్సీ, కోలాకు పోటీగా కాంపాను రిలయన్స్ తీసుకురాబోతోంది.
 
ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు రిలయన్స్ ఏజీఎం సమావేశంలో రిటైల్ వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. తాజాగా వేగంగా విస్తరిస్తోన్న ఎఫ్ ఎంసీజీలోకి అడుగుపెట్టాలని భావిస్తోన్న రిలయన్స్ కాంపాను కొనుగోలు చేసింది. 
 
ఈ ఏడాది దీపావళికి కాంపా బ్రాండ్‌ను విడుదల చేయాలని రిలయన్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జియో మార్ట్‌, కిరాణా స్టోర్స్, రిలయన్స్ రిటైల్స్ లో వీటిని విక్రయానికి ఉంచుతారు.