శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (10:24 IST)

మరోమారు పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరల్లో స్థిరత్వం కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరగటం తో రూ.48,880కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,800కు చేరింది.
 
మరోవైపు వెండి రేటు రూ.500 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.71,400 దిగివచ్చింది.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులతో పాటు.. దేశీయంగా కొన్ని రాష్ట్రాల్లో ఫెస్టివల్స్, శుభకార్యాల కారణంగా ఈ ధరలు పెరుగుతున్నాయి.