1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (14:08 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అప్లికేషన్, ఎగ్జామ్ ఫీజులుండవ్!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఇకపై ఎలాంటి అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజు చెల్లించనక్కర్లేదని  కేంద్రం 7వ వేతన సంఘం ప్రతిపాదనల్లో భాగంగా నిర్ణయించింది. 
 
కానీ ఈ సదుపాయం కేవలం దివ్యాంగులకు మాత్రమే. పీడబ్ల్యూడీ కోటా కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారందరూ ఈ ప్రయోజనం పొందవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
2016 జనవరి 1 నుంచి 7వ పే కమిషన్ సిఫార్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పలు లాభాలు పొందుతున్నారు. దివ్యాంగులకు ఫీజు మాఫీ చెయ్యాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇచ్చింది. 
 
దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.