మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (12:04 IST)

ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. ఇక అదనపు వివరాలను www.sche.ap.gov.in/icet వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు.
 
AP ICET ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, సంస్థలలో ఎంబీఏ లేదా ఎంసీఏ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఈ పరీక్షలో హాజరుకావచ్చు.