ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (12:48 IST)

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

ఏపీలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన విద్యార్థులు శ్రీరామచంద్ర బ్రదర్స్ ఫర్నీచర్ స్టోర్స్ లో షో రూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫిట్టర్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం అనుభవం ఉన్న వాళ్లతో ఫ్రెషర్స్ కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
సేల్స్ ఎగ్జిగ్యూటీవ్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనం ఉంటుంది. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ను అందిస్తారు. ఫిట్టర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-30 మధ్యలో ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 20 ఆఖరు తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.