శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:30 IST)

జేఈఈ మెయిన్స్ ఫలితాలు : అదరగొట్టిన తెలుగు విద్యార్థులు

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నాలుగో విడత పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్థరాత్రి ఈ పరీక్షా ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్.టి.ఏ) విడుదల చేసింది. 
 
ఈ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అదరగొట్టారు. ఏకంగా 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు.
 
వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్య, ఏపీ నుంచి నలుగురు విద్యార్థులు దుగ్గినేని వెంకటన ఫణీష్, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కర్నం లోకేశ్ టాప్ ర్యాంకుతో మెరిశారు.
 
కాగా, అర్థరాత్రి వేళ మెయిన్ ఫలితాలు విడుదల చేస్తుండడంపై ఎన్‌టీఏపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఏటీ గత మూడేళ్లుగా ఇదే పనిచేస్తోందని విమర్శిస్తున్నారు. 
 
కాగా, ఫలితాల విడుదల జాప్యానికి, సీబీఐ విచారణకు సంబంధం లేదని, సిబ్బంది అనారోగ్యానికి గురికావడం వల్లే జాప్యమైందని ఎన్ఏటీ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు.