1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జనవరి 2023 (18:27 IST)

భారత బీమా సంస్థ ఎల్.ఐ.సిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

life insurance corporation
ప్రభుత్వ రంగ బీమా సంస్థగా గుర్తింపు పొందిన భారత జీవిత బీమా సంస్థ ఎల్.ఐ.సిలో 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు రూ.లక్షకు పైగా వేతనం అందజేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
అభ్యర్థుల వయసు జనవరి 2023 ఒకటో తేదీ నాటికి 21 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి ఈ నెలాఖరు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు రూ.700, రిజర్వుడ్ అభ్యర్థులు రూ.85 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరి 17, 20 తేదీల్లో జరుగుతుంది. మెయిన్స్ రాత పరీక్ష మార్చి 18వ తేదీన ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.53600 నుంచి రూ.1,02,090 వరకు వేతనంగా చెల్లిస్తారు. ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.