గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (09:57 IST)

తెలంగాణాలో ఎడ్‌ సెట్ షెడ్యూల్ విడుదల

telangana state
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ నోటిఫికేషన్‌ను తాజాగా జారీచేసింది. వచ్చే జూలై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 220 బీఈడీ కాలేజీల్లోని 19600 సీట్ల భర్తీ కోసం ఈ ఎడ్ సెట్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వేషన్‌ విభాగాలకు చెందిన విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. 
 
అయితే, మెడిసిన్, బిఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసేవారు మాత్రం ఈ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలు రాయడానికి వీల్లేదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే వీరిని అనర్హులుగా పేర్కొంది. ఈ పరీక్షను తెలంగాణాలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేసిన సెంటర్లలో నిర్వహిస్తారు. 
 
ఈ ఎడ్ సెట్ పరీక్షకు ఈ నెల 7వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర కేటగిరీలవారు రూ.650 చొప్పున చెల్లించాల్సివుంటుంది. రూ.250 అపరాధంతో జూలై ఒకటో తేదీ వరకు, రూ.500 అపరాధంతో జూలై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించినట్టు తెలంగాణ ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.