గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By srinivas
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (12:34 IST)

ఎంబీబీఎస్ - బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్చుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకుగాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్చుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకుగాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు నోటిఫికేషన్ను కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదలచేసింది.
 
జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2018లో అర్హత సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.in లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాళోజి యూనివర్సిటీ ఉపకులపతి డా. కరుణాకర్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. ప్రవీణ్ కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారంకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు.